హ్యూమన్ రైట్స్ టుడే/ముచ్చింతల్ /జూన్ 11:
స్వాములు స్వాములుగా ఉండకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే… జరిగే పరిణామాలు వారి ఆధ్యాత్మిక జీవితంలోనూ ప్రభావం చూపిస్తాయి. చినజీయర్ పొలిటికల్ స్వామిగా.. అత్యంత ఖరీదైన స్వామిగా ప్రసిద్ధులు. ఇప్పుడు ఆయన మేనల్లుడి వ్యవహారం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయం అంతా .. చినజీయర్ వారసుడి తరహాలో స్వామిలాగా .. ముచ్చింతల్ ఆశ్రమంలో తిరిగే అయన సాయంత్రం అయ్యే సరికి పబ్బులు, క్లబ్బుల్లో సేదదీరుతూంటారని ఫోటోలతో సహా వెలుగులోకి వచ్చాయి. నిజానికి చినజీయర్ భువబంధాలకు అతీతుడనని చెప్పుకుంటారు. సన్యాసం తీసుకున్నప్పుడే అన్నింటినీ వదిలేశానని చెబుతారు. అయితే ఆయన తన మేనల్లుడిని తన తదుపరి వారసుడ్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్రస్ట్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆయన చినజీయర్ మేనల్లుడని చాలా మందికి తెలియదు. కానీ హఠాత్తుగా ఆయన ప్రైవేటు లైఫ్ సహా మొత్తం బయటకు వచ్చింది. ఆయన ఏం చేసినా అది వ్యక్తిగతం కానీ.. ప్రజలకు ఏం చేయకూడదో చెప్పి.. అదే చేయడం ఏమిటన్న విమర్శలు ఈ కారణంగా వస్తున్నాయి. చినజీయర్ తన ఆశ్రమంలో లేదా ట్రస్టుల్లో ఎవరిని పెట్టుకుంటారు.. అన్నది ఎవరికీ అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే రాజకీయ స్వామిగా మారారో అప్పుడే అందరికీ అవసరం అయింది. ముందు ముందు చినజీయర్ విషయంలో మరిన్ని వివాదాలు వస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. శారదాపీఠం పేరుతో మరిన్ని రాజకీయాలు చేసే స్వరూపానంద కూడా తన మేనల్లుడు అయిన యువకుడ్ని తదుపరి ఉత్తరాధికారిగా నియమించి ఇప్పటికే జోరుగా ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు.