హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 11:
తెలంగాణలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 503 పోస్టులకు గానూ.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
గ్రూప్-1 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా. అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకున్నా అధికారులు.. కేంద్రంలోకి షూలు, ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్ లాంటి పరికరాలను అనుమతించలేదు. చేతులకు గోళ్ళ మైదాకు బంగారు ఆభరణాలు అనుమతించలేదు అభ్యర్థులకు ఇది కఠిన పరీక్షే
తొందర్లోనే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండవసారి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపారు.