హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జూన్ 11:
ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న నిజామాబాద్ జర్నలిస్టులకు తీపి కబురు వినిపించారు ఎమ్మెల్సీ కవిత. ఏళ్ల తరబడి ఇంటి స్థలాలు లేక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసి చూసీ నిరాశపడి దిగాలు చెందిన ఇందూరు విలేకలకు ఇది శుభవార్తే. ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రెస్‌క్లబ్‌లో మీడియా వాళ్లతో మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టులు, అన్ని యూనియన్లన్నీ రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా అర్హులైన విలేకరుల జాబితాను అందిస్తే నెల రోజుల్లో వారికి ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తనదని ఆమె హామి ఇచ్చారు.
మొన్న సీఎం జిల్లా టూర్ సందర్భంగా జర్నలిస్టులంతా ఇదే విషయంపై సీఎంను కలిసి వినతిపత్రం ఇస్తామని కోరగా.. ఇప్పుడు సందర్భం కాదని నేతలు వారించారు. దీంతో కవిత చాలా రోజుల తర్వాత నిజామాబాద్‌కు రావడం.. ఆమెను ప్రెస్‌క్లబ్‌కు ఆహ్వానించడం.. ఈ ఇంటి స్థలాల అంశాన్ని జర్నలిస్టులు తీసుకురావడం.. ఆమె వెంటనే స్పందిచండం.. అన్నీచకచకా జరిగిపోయాయి. ఇప్పటికైనా తమ ఆశ నెరవేరనుందని మీడియా మిత్రులు ఆనందంలో ఉన్నారు.