హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 11:
శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సౌందర్య ఆత్మహత్య కు పాల్పడ్డారు. మహారాష్ట్రకు చెందిన గాజుల సౌందర్య మూడేళ్లుగా కొండాపూర్‌లోని ఐబీఎం IBM లో ఉద్యోగం చేస్తున్నారు. 2022 డిసెంబర్ 2న మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ అభినవ్ తో వివాహం జరిగింది. ఈనెల 8న సౌందర్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ రోజు సాయంత్రం భర్త అభినవ్‌తోపాటు మామకు ఫోన్ చేశారు. తాను దూరంగా వెళ్లపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి.. శంషాబాద్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి దూకుతున్నట్లు భర్తకు చెప్పారు.
దీంతో భర్త అభినవ్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సౌందర్య భవనం నుంచి దూకి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ నిన్న శనివారం రాత్రి మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శంషాబాద్‌లోని అర్కాన్ హాస్పిటల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి సౌందర్య దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. తాను ఊహించుకున్నట్లుగా జీవితం ఉండడం లేదని తరుచూ ఫ్రెండ్స్‌తో చెప్పారని, ఇటీవలే భర్త ఉద్యోగం కోల్పోవడంతో.. ఇంటివద్దే ఉంటున్నారు. దీంతో సౌందర్య మానసికంగా బాధపడుతూ.. అనుకున్న విధంగా భర్త దొరకకపోవడం.. ఊహించుకున్న జీవితం లేకపోవడం వల్లే.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. శంషాబాద్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.