ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల

Get real time updates directly on you device, subscribe now.

2024 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండితే ఓటు..

అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితా..

జనవరి 5వ తేదీన తుది జాబితా..

ఆదేశాలు జారీ చేసిన ఈసీఐ

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/జూన్ 09: పార్లమెంటు, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో అర్హులందరినీ ఓటర్లుగా చేర్చేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సమాయత్తం అయింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం – 2024 కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈసీఐ విడుదల చేసిన షెడ్యూల్ కలెక్టరేట్ కు వచ్చింది. ఓటర్ల జాబితా సవరణ ప్రీ రివిజన్ యాక్టివిటి, రివిజన్ యాక్టివిటీ అనే రెండు దశల్లో సాగుతుంది.

ప్రస్తుతం ప్రీ రివిజన్ యాక్టివిటీని జిల్లా యంత్రాంగం చేపట్టనుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment