లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 40 మందికి గాయాలు!!

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 09:
విజయవాడ 65వ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద విజయవాడ వైపు వెళ్తున్న కోదాడ ఆర్టీసీ డిపో బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటనతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment