బస్టాండ్ ప్రారంభోత్సవం వాయిదా❓️పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే అసహనం

Get real time updates directly on you device, subscribe now.

బస్టాండ్ ప్రారంభోత్సవం వాయిదా❓️

ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కన్పించని బస్టాండ్‌ పేరు

ప్లాట్‌ఫాం ఎత్తు పెంపుతో ఆలస్యం వల్లే..

హ్యూమన్ రైట్స్ టుడే/గద్వాల జిల్లా /జూన్‌ 09:
జిల్లా కేంద్రంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండ్‌ ప్రారంభం వాయిదా పడినట్లేనా అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అదే రోజు నూతన బస్టాండ్‌ను ప్రారంభిస్తారని వేసుకున్న అంచనా తప్పిపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదు గా ప్రారంభించేందుకు అధికారులు, పార్టీ నాయకులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. అయితే ఆ కార్యక్రమాల జాబితాలో నూతన బస్టాండ్‌ పేరు ప్రస్తావన లేకపోవడంతో వాయిదా పడినట్టేనని స్పష్టమవుతోంది.

*పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే అసహనం

గద్వాల పాత బస్టాండ్‌లో గతంలో పది ప్లాట్‌ఫాంలు ఉండేవి. నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్‌లో వాటి సంఖ్య 15కు పెంచారు. ప్రయాణికులు వేచి వుండే ప్రాంగణం కొత్త డిజైన్‌ మేరకు ఎత్తు పెరిగింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫాం ముందు ఆగిన బస్సులో ప్రయాణీకులు ఎక్కడం, దిగడం అసౌకర్యంగా మారింది. ఈ నేపథ్యంలో బస్సు ఆగే ప్రాంతం ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ఆ పనులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం వల్ల బస్టాండ్‌ ప్రారంభోత్సవం ఆలోచనను విరమించుకున్నారు. ఇటీ వల బస్టాండ్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి రెండుసార్లు పరిశీలించారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆసహసం వ్యక్తం చేశారు. పనులు పూర్తయ్యాకే ప్రారంభోత్సవం చేద్దామని అధికారులతో చెప్పారు. దీంతో ఆ పనులను త్వరలో ప్రారంభించేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధమయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment