హ్యూమన్ రైట్స్ టుడే/కుల్కచర్ల /జూన్ 08:
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం.డీ గౌస్ (31) భహిర్బూమికి చెరువు దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి పిడ్స్ రావడంతో చెరువులో పడి మృతిచెందాడు. చెరువు గట్టుపై చెప్పులు, పోన్ ఉండటాన్ని గమనించిన కొందరు గ్రామస్తులు అతడు గ్రామానికి చెందిన గౌస్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. మృతుడి భార్య షభాన బేగం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీశైలం పేర్కొన్నారు. కాగ మృతుడికి ఒక పాప, బాబు ఉన్నారు.