హ్యూమన్ రైట్స్ టుడే/కందుకూరు/జూన్ 08:
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలోని ర బైరాగి గూడా గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఊదరి అనిల్ కుమార్… కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన ఊదరి అనిల్ కుమార్ లేమూర్ సబ్ స్టేషన్ లో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు.
గురువారం విధి నిర్వహణలో భాగంగా అనిల్ కుమార్ విద్యుత్ అధికారుల నుంచి (ఎల్ సీ) అనుమతి తీసుకొని విద్యుత్ స్తంభం పైకి ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ అధికారులు (ఎల్ సి) విద్యుత్ ఆన్ చేయడంతో కరెంటు స్తంభం పైన షాక్ తగిలింది. అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు తాత్కాలికంగా విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు.మృతుడికి వివాహమై 10 నెలలు అవుతుంది.అనిల్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్ట్ మార్థం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.