హ్యూమన్ రైట్స్ టుడే/తొర్రూరు /జూన్ 08:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. మహబూబూబాద్ జిల్లా తొర్రూరు టౌన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ధరంసోత్ వెంకన్నకు సంబంధించిన లేబర్ కార్డ్, మరణ ప్రయోజనం మంజూరు కోసం తొర్రూర్ టౌన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పొలం సుమతి నుంచి రూ.20వేలు డిమాండ్ చేశారు.
దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. గురువారం పక్కా ప్లాన్ తో అధికారిని పట్టుకున్నారు. సదురు అధికారిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.