శేజల్ ఫిర్యాదు పై స్పందించిన మహిళ కమిషన్ తెలంగాణ డిజిపి కి ఆదేశాలు
హ్యూమన్ రైట్స్ టుడే/బెల్లంపల్లి /జూన్ 08:
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ గురువారం స్పందించింది. శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న మహిళా కమిషన్ 15 రోజుల్లో అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. శేజల్ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఢిల్లీలోని తిలక్‌మార్గ్ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ప్రశ్నించింది.