హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ /జూన్ 08: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో గురువారం అపశృతి చోటు చేసుకుంది. భీంగల్ మండలం పురానిపెట్ గ్రామంలో ఊర చెరువుల పండగకు ఆయన హాజరు అయ్యారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు.
బాణాసంచా భారీ సంఖ్యలో పేల్చడంతో అవి కాస్త పక్కనే ఉన్న టెంట్‌పై పడ్డాయి. ఆ ప్రభావంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే స్థానికులు సత్వరమే స్పందించి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా.. బాణాసంచాతో పెను ప్రమాదమే జరిగింది. అగ్ని ప్రమాదం.. దానికి కొనసాగింపుగా సిలిండర్లు పేలడంతో నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే…