తప్పుదిద్దుకోడానికి ఏడేండ్లు పట్టింది

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మే 21:
2000 నోటు ఉపసంహరించుకుంటూ కేంద్ర తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషం కలిగించిందన్నారు. చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడేళ్లు సమయం పట్టిందంటూ చురకలు వేశారు.

కారైకుడిలో ఆదివారంనాడు మీడియాతో చిదంబరం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నోట్లను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద పొరపాటని, దేశ ప్రజలు కూడా దానిని ఇష్టపడలేదని అన్నారు. రద్దయిన నోట్ల స్థానే రూ.2,000 నోటు తీసుకురావడాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. అయితే, కేంద్రం మాత్రం రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో చాలా బ్లాక్‌మనీ ఉందని, ఆ కారణంగానే ఆ కరెన్సీ నోట్లను రద్దు చేసి రూ.2,000 నోట్లను ప్రవేశపెడుతున్నట్టు వాదించిందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం పొరపాటు మాత్రమే కాదని, తొందరపాటు నిర్ణయమని చిదంబరం విమర్శించారు. రద్దు చేసిన రూ.500 నోట్లనే మళ్లీ తేవడం, కొత్తగా తెచ్చిన రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం వంటి చర్యలు ‘తుగ్లక్ దర్బార్‌’ను తలపిస్తు్న్నాయని, సామాన్య ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెట్టేశాయని ఆయన తప్పుపట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment