అసలు.. ఇది ఎవరికి లాభం..? మరెవరికి నష్టం?

Get real time updates directly on you device, subscribe now.

రెండు వేల నోటు ఉపసంహ”రణం”

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 21:
సర్క్యూలేషన్ లో వున్న రూ.2 వేల నోటును ఉపసంహంచుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.. దీంతో, సామాన్యుల్లో గందరగోళం మొదలైంది. 2 వేల నోట్లు బ్యాంకులకు ఇస్తే ఏమవుతుందోనంటూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు.. ఇది ఎవరికి లాభం..? మరెవరికి నష్టం? అనే చర్చ సాగుతోంది.. అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు.. డబ్బులు ఆశ చూపించి ఓట్లు కొనుక్కుందామని చూసే పార్టీలకు నోట్ల రద్దుతో గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయన్నారు.. ఓటింగ్ శాతం పెరిగితేనే ప్రజాస్వామ్యం పర్యవేక్షణ సాధ్యమన్న ఆయన.. బ్లాక్ మనీ ఉన్న వాళ్లకు తప్ప.. రెండు వేల నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులకు నష్టం లేదని స్పష్టం చేశారు.

రూ.2 వేల నోట్లపై కొత్త టెన్షన్‌.. బ్యాంకులో వేస్తే ఐటీ వాళ్లు పట్టుకుంటారా?

మరోవైపు.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటుకు రెండు వేల రూపాయలు పంచిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు విష్ణుకుమార్‌ రాజు.. పెద్దనోట్ల వల్ల ఎదురయ్యే సమస్యలు గుర్తించే నేను ఆర్బీఐకి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు.. ఇక, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా నోట్లు చెలామణీకి ప్రయత్నాలు జరుగుతాయి. లిక్కర్ షాపుల్లో 2వేల రూపాయల చెలామణిపై వ్యవస్థలు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.. మరోవైపు.. నేను పార్టీ మారుతున్నాననే ప్రచారం రాజకీయ కుట్రగా అభివర్ణించారు విష్ణుకుమార్‌ రాజు.. పొత్తులు నిర్ణయించే ది కేంద్ర నాయకత్వమని స్పష్టం చేసిన ఆయన.. నా అభిప్రాయం విస్పష్టంగానే చెప్పానని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment