హైదరాబాద్లో జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 21:
నగరంలో జోరుగా వర్షం పడుతోంది. జూబ్లీ హీల్స్, మాదాపూర్ ఫిలింనగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగం పల్లి, పటాన్ చెరు, మెహిదీపట్నం కొండాపూర్, కేపీహెచ్ బీ, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తోంది.
ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనాలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
భారీగా వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి ఎండవేడిమికి నగరవాసులు అల్లాడిపోయారు. సాయంత్రం ఇలా ఒక్కసారిగా వర్షం కురుస్తుండండతో వారికి కాస్త ఉపశమనం లభించినట్టు అయింది.
ఇక ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం అయిపోతుంటే అన్నదాతలు కంట నీరు ఆగడం లేదు.