సైబరాబాద్‌లో ఘరానా మోసం గుట్టురట్టు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 20:
సైబరాబాద్‌లో ఘరానా మోసం గుట్టురట్టయింది. XITO కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రై.లి. పేరుతో కేటుగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. పెట్టుబడులపై భారీ రాబడి పేరుతో రూ.20 కోట్లు వసూలు చేశారు. డిజిటల్ కరెన్సీ పేరుతో GoFlyx ద్వారా నిందితులు ప్రలోభపెడుతున్నారు. ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో వున్నారు. గాదిరాజు రాజేంద్ర, పాశం వెంకట్, అవలకొండప్ప చలపతిని పోలీసులు అదుపులోకి తీసున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.