తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు..!!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 20:
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు..దారి మళ్లిస్తూ అధికారులు శనివారం నాడు ప్రకటన చేసారు. ఖాజీపేట సెక్షన్‌లో పరిధిలో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ నెల 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు పలు రైళ్ల షెడ్యూల్ లో మార్పులు చేసారు. కాజీపేట-కొండపల్లి సెక్షన్ పరిధిలోని చింతపల్లి- నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టాల్సి ఉండటంతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
రద్దయిన సర్వీసులు : ట్రైన్ నంబర్ 07753 కాజీపేట డోర్నకల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07754 డోర్నకల్ -కాజీపేట ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07755 విజయవాడ-డోర్నకల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07756 డోర్నకల్ – విజయవాడ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07464 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07465 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను మే 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 17660 భద్రాచలం రోడ్ – సికింద్రాబాద్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17659 సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 12713 విజయవాడ-సికింద్రబాద్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్ 12714 సికింద్రాబాద్- విజయవాడ ఎక్స్ ప్రెస్ మే 21 నుంచి జూన్ 7వరకు రద్దు అయ్యింది.