హైదరాబాద్‌కు రానున్న మరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 20:
మహానగరానికి మరో కంపెనీ రానుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికాకు చెందిన అలియంట్ గ్రూప్ సంస్థ హైదరాబాద్‌లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ శనివారం వెల్లడించారు. ఈ మేరకు హూస్టన్‌లో ఆ కంపెనీ సీఈఓ ధవల్ జాదవ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ సెంటర్ ద్వారా ఆ సంస్థ కొత్తగా 9 వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అలింట్ గ్రూప్ నిర్ణయంతో తెలంగాణతో పాటు భారత్ బీఎఫ్ఎస్ఐ పరిశ్రమకు భారీ ప్రోత్సాహంగా మారుతుందని, ఆ సంస్థ నగరంపై విశ్వాసాన్ని నమ్మకాన్ని చూపుతోందని వెల్లడించారు. అలియంట్ గ్రూప్ సెంటర్ ఏర్పాటు టాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు సదవకాశం అవుతుందని మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.