ఎవరికి వారే యమునా తీరే
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ / మే 19:
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిల్లీ వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన హస్తినకు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడు రోజుల దిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక సంజయ్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
దిల్లీ పర్యటనలో భాగంగా ఈటల అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీని ఎలా అధికారంలోకీ తీసుకురావాలనే అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం ఈటల హైదరాబాద్ చేరుకోగా.. బండి సంజయ్ శుక్రవారం ఉదయం దిల్లీ వెళ్లారు. అగ్ర నేతలతో భేటీ అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెలంగాణపై కర్ణాటక ఎన్నికల ప్రభావం, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ఆయన నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.