రూ. 2 వేల నోట్లు చెల్లుబాటు అవుతాయి: ఆర్బీఐ

Get real time updates directly on you device, subscribe now.

రూ,₹2వేల నోట్లు చెల్లవు RBI క్లారిటీ

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: రూ.₹2వేల నోట్లును ఉపసంహరిస్తూ RBI తీసుకోగా నోట్లను రద్దు చేసినట్లు చాలామంది భావిస్తుండగా RBI స్పందించి ‘₹2వేల నోటు చెల్లుబాటు అవుతుంది. ప్రజలు సాధారణ లావాదేవీలకు ₹2వేల నోటును ఉపయెగించుకోవచ్చ స్వికరించవచ్చు సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను బ్యాంకులో నైనా ₹2వేల నోట్లు మార్చుకోవచ్చు ఒక బ్రాంచీలో ఒకేసారి ₹20వేల మార్చుకోవచ్చు అని RBI తెలిపింది.

రూ.2వేల నోట్ల జారీపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రూ.2వేల నోట్లపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

రూ.2వేల నోట్ల నోట్లను చలామణి నుంచి ఆర్‌బీఐ ఉపసంహరించుకోనుంది.

రూ.2వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా  మర్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు  పేర్కొంది. ఒక విడతలో రూ.20వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిపాజిట్‌ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించలేదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment