సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జిల నియామకం
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ:
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కల్పతి వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఇద్దరు న్యాయమూర్తులతో సీజేఐ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు.