జర్నలిస్టులపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి: జగిత్యాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు

Get real time updates directly on you device, subscribe now.

జగిత్యాలలో జర్నలిస్టుల నిరసన…
జర్నలిస్టులపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని జగిత్యాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ముక్తకంఠంతో…
హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల/మే 19: హైద్రాబాద్ లో ఏబిఎన్, హెచ్.ఎం.టి.వి కేమారా మెన్, జర్నలిస్టులపై జరిగిన దాడి అమనుషమని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని జగిత్యాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. హైద్రాబాద్ జర్నలిస్టులపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం జగిత్యాల జర్నలిస్టులు స్థానిక తహసిల్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న ఏబిఎన్, హెచ్.ఎం.టివి జర్నలిస్టులపై దాడిచేయడం దారుణమని ప్రెస్ క్లబ్ అద్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని దాడులు చేసే వారిపై న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్న మార్పులు రావడం లేదన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొన్నప్పుడే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని శ్రీనివాసరావు అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి వంశీ తోపాటు హెచ్.ఎం.టి.వి ఆనంద్, ఏ. బి.ఎన్ శ్రీనివాస్ తోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment