హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
ఈ నెల 18న రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సిల్‌వెల్ కార్పొరేషన్, ఆర్‌ఆర్.ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, కృష్ణ, దాసరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయని ఆమని తెలిపారు. ఈ మేరకు మంగళవారం జయంతి వేడుకల వాల్‌పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినీ దిగ్గజాల జయంతులను పురస్కరించుకుని సినీ గీతాంజలి నిర్వహించడంతో పాటు పలువురు ప్రముఖులకు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసుధనాచారి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, సినీనటుడు సుమన్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.