భూమా అఖిల ప్రియ అరెస్ట్…
హ్యూమన్ రైట్స్ టుడే/నంద్యాల జిల్లా:
ఆళ్లగడ్డలో ఉద్రిక్తత టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులను ఆళ్లగడ్డలో అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల పీఎస్ కు తరలించారు. అఖిల ప్రియ అరెస్ట్ తో ఆళ్ళగడ్డలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర నంద్యాలలో కొనగుతుండగా మే 16న లో ఏవీ సుబ్బారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అదే పార్టీకి చెందిన అఖిల ప్రియ వర్గం నేతలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేష్ ముందే ఈ దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. AV సుబ్బారెడ్డిని అఖిలప్రియ వర్గానికి చెందిన వారు వెంబడించి దాడి చేశారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులపై హత్యయత్నం కేసులు పెట్టారు.