కేరళ స్టోరీ” డైరెక్టర్, హీరోయిన్ కి యాక్సిడెంట్
హ్యూమన్ రైట్స్ టుడే:
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన “ది కేరళ స్టోరీ” మూవీ దర్శకుడు సుదీప్తో సేన్, హీరోయిన్ ఆదాశర్మ యాక్సిడెంట్ కి గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు వారు హాజరు కావలసి ఉంది. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన కారణంగా హిందూ ఏక్తా యాత్రకు హాజరు కాలేకపోతున్నామని.. ఇందుకు చాలా బాధగా ఉందని ట్వీట్ చేశారు దర్శకుడు సుదీప్తో సేన్.