కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐకి కొత్త డైరెక్టర్

Get real time updates directly on you device, subscribe now.

కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు

హ్యూమన్ రైట్స్ టుడే/బెంగళూరు:
కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐకి కొత్త డైరెక్టర్ను నియమించింది కేంద్రం. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్కు సీబీఐ నూతన డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వెల్లడించింది. ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జయస్వాల్ స్థానంలో ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్రం వివరించింది. మే 25న జయస్వాల్ పదవీ కాలం ముగుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సీబీఐ డెరెక్టర్ను ఎంపిక చేసే ప్యానల్.. ప్రవీణ్ సూద్ నియామకానికి ఆదివారం ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్యానల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.
సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్.. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. గత మూడు సంవత్సరాలుగా ఆయన కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment