గుండు కొట్టి పంపించిన కన్నడిగులు

Get real time updates directly on you device, subscribe now.

గుజరాత్ ప్రయోగాలు చేస్తే గుండు కొట్టి పంపించిన కన్నడిగులు, 75లో !
హ్యూమన్ రైట్స్ టుడే/బెంగళూరు/గుజరాత్/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకాలం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
ఏదో చెయ్యాలని అనుకున్న బీజేపీ హైకమాండ్ కు సినిమా కనపడింది. గుజరాత్ ప్రయోగాలు కర్ణాటకలో చెయ్యాలని ప్రయత్నించిన బీజేపీ నాయకులకు గుండు కొట్టిన కన్నడిగులు అందర్ని ఇంటికి పంపించేశారు.

గుజరాత్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అడ్డుకట్ట వేసిన బీజేపీ హైకమాండ్ కొత్త ముఖాలను రంగంలోకి దించింది. గుజరాత్ లో కొత్త ముఖాలతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ నాయకులు గుజరాత్ లో విజయం సాధించారు.

*మూడు పార్టీలతో ఫుట్ బాల్ ఆడుకున్న గాలి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే !*

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ అహమ్మదాబాద్ లో భారీ రోడ్ షోలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. సేమ్ అదే టైప్ లో పోటింగ్ మూడు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో రెండు రోజుల పాటు భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఇది బీజేపీ నాయకులు వేసిన గుజరాత్ స్కెచ్.

గుజరాత్ లో సీనియర్ నాయకులను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్ కొత్త వారిని రంగంలోకి దింపి విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గుజరాత్ లో చేసిన ప్రయోగం కర్ణాటకలో కూడా చెయ్యాలని, బీజేపీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి కొత్తవాళ్లకు చాన్స్ ఇవ్వాలని కొందరు నాయకులు బీజేపీ హైకమాండ్ కు బ్రైన్ వాష్ చేశారు.

*ఒకే ఇంట్లో డబుల్ ఢమాక, తండ్రీకొడుకు ఎమ్మెల్యేలు, భారీ మెజారిటీ !*

గుజరాత్ ప్రయోగం దేశం మొత్తం చేస్తే సరిపోతుంది అని అనుకున్నారో ఏమో కాని బీజేపీ నాయకులు కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకుల మీద కన్ను వేశారు. ఇందులో భాగంగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కొత్త ముఖాల కోసం బీజేపీ నాయకులు వేట మొదలుపెట్టారు. బీజేపీలోని కొందరు నాయకులు సీక్రేట్ గా కొత్త ముఖాల కోసం వెతికారు.

అందులో భాగంగానే మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్, ఈశ్వరప్ప, లక్ష్మణ సవది, మైసూరుకు చెందిన మాజీ మంత్రి రామ్ దాస్ తో పాటు చాలా మంది బీజేపీ సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి ఏకంగా 75 మంది కొత్త ముఖాలకు బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది.

*మంత్రులకే మతిపోగొట్టిన ఓటర్లు, చిత్తుగా ఓడించి గేట్ పాస్* !

గుజరాత్ టైప్ లో 75 మంది కొత్త ముఖాలను రంగంలోకి దింపిన బీజేపీ హైకమాండ్ విజయం మాదే అని ధీమా వ్యక్తం చేసింది. అయితే జగదీష్ శెట్టర్ తో పాటు లక్ష్మణ సవది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చాలా మంది నాయకులు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరిపోయారు. కొందరు నాయకులను కాదని బీజేపీ మరోకరికి సీట్లు ఇచ్చింది.

75 మంది కొత్త ముఖాల్లో కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించడతో 61 సీట్లలో బీజేపీ చిత్తుచిత్తూగా ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోకి కోలారు జిల్లాలోని మాలూరులో కొన్ని సంవత్సరాలుగా బీజేపీకి పని చేసి కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేసిన హుడి విజయ్ కుమార్ ను కాదని వేరే వ్యక్తికి బీజేపీ హైకమాండ్ సీటు ఇచ్చింది.

అయితే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన హుడి విజయ్ కుమార్ దెబ్బకు బీజేపీ ఖంగుతినింది. కర్ణాటకలో గుజరాత్ ప్రయోగాలు చెయ్యాలని అనుకున్న బీజేపీ నాయకులకు కన్నడిగులు గుండు కొట్టించి ఇంటికి పంపించేయడంతో దెబ్బకు ఆ నాయకుల మైండ్ బ్లాక్ అయ్యింది. గుజరాత్ ప్రయోగాలు దేశం మొత్తం పని చెయ్యవని బీజేపీ నాయకులు చాలా ఆలస్యంగా గుర్తించడంతో అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment