హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లిజిల్లా :
జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో శనివారం నాడు రహదారిపై బైఠాయించి అన్నదాతల ఆందోళన చేపట్టారు. నడిరోడ్డు మీద వడ్లకుప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం క్వింటాలుకు ఐదు కిలోల ధాన్యం కోత విదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7.5 కిలోలు కటింగ్ ఇస్తేనే కొనుగోలు చేస్తామంటున్న సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు వచ్చి మాట్లాడి వెల్లే వారే గానీ.. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సెంటర్ ఇంచార్జ్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసుకునేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. రైతుల ఆవేదనకు ప్రభుత్వం గుర్తించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుందా అనే ప్రశ్రలు వెల్లువెత్తుతున్నాయి.