హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ / మే 02:
తెలంగాణ సర్కారుకు ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతులు పంట నష్ట పరిహారం కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.