వైద్యశాఖలో కొలువుల జాతర

Get real time updates directly on you device, subscribe now.

1,827 స్టాఫ్ నర్స్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 1:
వైద్య ఆరోగ్యశాఖలో కొలువులు జాతర కొనసాగుతోంది. కొత్తగా మరో 1,827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, టీఎస్ పీఎస్సీల ద్వారా మొత్తం 14,562 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో ఇప్ప టికే 960 మంది ఎంబీబీఎస్ వైద్యుల నియామక ప్రక్రియను మెడికల్ బోర్డు పూర్తి చేసింది. 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా గత ఏడాది డిసెంబరు 6న నోటిఫికే షన్ ఇవ్వగా.. నేడో రేపో మెరిట్ లిస్టు విడుదల కానుంది. మే మొదటి వారంలో వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. వాస్తవానికి వైద్య ఆరోగ్యశాఖలో 12,735 పోస్టుల భర్తీకి సర్కారు గతంలో గ్రీన్ సిగ్నలి చ్చింది. ఆమేరకు ఆర్థికశాఖ వేర్వేరు జీవోలను జారీ చేసింది. వీటిల్లో 10,028 పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. మిగతా 2,662 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. ఆయుష్కు చెందిన 689 పోస్టులను టీఎస్ పీఎస్సీ మినహా యించింది. వాటిని మెడికల్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment