నూతన సచివాలయంలో నేడు కేసీఆర్ సమీక్ష
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో సిఎం సమావేశమందిరంలో సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ సమీక్షా సమావేశంలో… కరివేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ ,కొడంగల్, వికారాబాద్ కు వెళ్లే తాగునీటి కాల్వల గురించి చర్చించనున్నారు.
ఈ సమీక్షలో… జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు, సిఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మరియు ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొననున్నారు.