కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఏప్రిల్ 30:
తెలంగాణ ముఖ్యమంత్రి కాంట్రాక్టు ఉద్యోగులకు పండగలాంటి వార్త చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు అధికారికంగా ముద్ర పడింది. తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం…
సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సంతకం చేశారు. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.