ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్
బహుమతులు అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు.
హ్యూమన్ రైట్స్ టుడే/పెన్ పహాడ్ ఫిబ్రవరి 19 : యువత క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు అన్నారు. మండల కేంద్రంలో ఈనెల 05 నుండి 18 వరకు సచిన్ టెండుల్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసి మాట్లాడారు. యువతను క్రీడలలో ప్రోత్సహించాలని అన్నారు. ఈ క్రీడల్లో పిచ్చిరెడ్డి ఫౌండేషన్ పొనుగోడు ప్రధమ బహుమతి గెలుపొందగా విదితీయ బహుమతి పెన్ పహాడ్ సచిన్ టెండుల్కర్ అసోసియేషన్. తృతీయ బహుమతి మాచారం క్రికెట్ యూత్ చతుర్ధ బహుమతి దుబ్బ తండ గ్రామానికి చెందిన క్రికెట్ యూత్ వారు గెలుపొందారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తండ నాగరాజ్. పేరూరి వెంకటేష్. కొండేటి గోపి. పేరాల నాగేందర్. కటోజు నరేష్. దండంపల్లి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.