హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 13: మా ఇంటాయన తాగుబోతు అయిపోయాడు సంసారం నాశనమైపోతుందని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నారని, పురుష మా లోకం లబోదిబోమంటున్నారు.
మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసిన సంపాదిస్తున్నదంతా సారాకు తగలేస్తున్నారని, మీరే తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వెలుగుచూసింది.
బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్లుగా నాటు సారా తయారుచేస్తూ విక్రయిస్తున్నారని తెలిపారు. ఊళ్లో మగాళ్లంతా కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే అడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి ధారబోసేస్తున్నారని వాపోయారు.
దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని వారికి ఏడుపు ఒక్కటే తక్కువయ్యింది. సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు కోరారు. బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసు కెళ్లిన బాధితులు సారాను అడ్డుకోవాలని కోరారు.
