శైవ క్షేత్రాలకు బస్సులు నడపడంలో బద్వేల్ ఆర్టీసీ అధికారులు విఫలం
ఆంధ్ర ప్రదేశ్/బద్వేల్ /హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ బద్వేలు:-
బద్వేల్ పట్టణానికి సమీపంలోని సేవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు నడపడంలో బద్వేలు ఆర్టీసీ డిపో అధికారులు విఫలమయ్యారు బద్వేల్ నుండి లంక మల పుణ్యక్షేత్రానికి బస్సులు నడపంలో బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ సమయపాలన పాటించకపోవడంతో సరైన సమయంలో బస్సులు నడవక భక్తులు చాలా ఇబ్బందులు పాలు అయ్యారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం నుండి నాలుగు గంటల వరకు లంకమల క్షేత్రంలో ఒక్క బస్సు కూడా లేకపోవడంతో నాలుగు గంటల తర్వాత వచ్చిన బస్సు కోసం ఆ భక్తులు ఎగబడడంతో భక్తులు కింద పడిపోయి గాయాల పాలయ్యారు, బస్సు కింద పడే ప్రమాదం తృటిలో తప్పింది బద్వేల్ ఆర్టీసీ డిఎం ను రాయలసీమ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఇది సర్వ సాధారణమే అనని నిర్లక్ష్య సమాధానం చెప్పాడు. బస్సుల సంఖ్య పెంచకపోవడంతో సమయానికి బస్సులు చేరక లంక మల్ల కు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సులో సమయానికి రాకపోవడంతో చిన్నపిల్లల తల్లులు వృద్ధుల తో పాటు భక్తులు అసహనానికి గురై ఆర్టీసీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ అధికారులు శుద్ధితో ప్రజల కోసం ఏర్పాటుచేసిన ప్రజా రవాణా సంస్థను నిర్వీర్యం చేయకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని భక్తులు అన్నారు చార్జీలు కూడా పరిణిత్తకి మించి లంకములకు 85 రూపాయలు వసూలు చేయడంతో భక్తులు నిర్గంత పోయారు చేసేదేమీ లేక చెల్లించి ప్రయాణాలు చేశామని వాపోయారు. ఉన్నత అధికారులు బద్వేల్ డిపో అధికారుల పనితీరు పై నిఘా పెట్టి విచారణ చేయవలసిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.