ఉగ్రవాది కంటే మహా డేంజర్ ఈ జార్జ్ సోరోస్.. భారత ఆర్ధిక రంగాన్ని కుప్పకూల్చే ప్రయత్నాల్లో తాను ఎంచుకున్న మొట్టమొదటి టార్గెట్ ‘అదానీ’..!!!
బిన్ లాడెన్ అమెరికా లోని ట్విన్ టవర్ లను కూల్చి ఉగ్రవాదిగా తనకున్న ‘నెట్వర్క్’ ఏపాటిదో ప్రపంచానికి చూపాడు.. కానీ సోరోస్ ఏకంగా దేశ ప్రభుత్వాలనే కూల్చే పడేసే ‘నెట్వర్క్’ ఉన్న వాడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించాడు.
సోరోస్ అంతర్జాతీయంగా మరియు భారత్ లో ఉన్న తన ‘నెట్వర్క్’ ద్వారా మన దేశంలోని దిగ్గజ వ్యాపారి అదానీ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి భారత్ లోని స్టాక్ మార్కెట్ కుదుపులకు కారణం అయ్యాడు. వ్యాపార రంగం కుదేలైతే భారత్ ఆర్ధికంగా దివాలా తీస్తుందని, అది ఎన్నికల సమయానికి వచ్చేసరికి మోదీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందనే కచ్చితమైన ప్రాణాళిక సిద్దం చేస్కుని ఈ ‘హిండెబర్గ్’ అనే హిట్ జాబ్ కి పూనుకున్నాడు అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట.
మన దేశంలో ఈ సోరోస్ నెట్వర్క్ లో కొన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయనేది ఎవరూ కాదనలేని సత్యం అందుకే ఒక భారత వ్యాపారి పై విదేశీ ‘అనామక సంస్థ’ తన ఊహాగానాలకు అనుగుణంగా తయారుచేసిన రిపోర్టుని అడ్డం పెట్టుకుని దేశ పార్లమెంటునే స్తంభింభ చేయడం అనేది ఈ అనుమానాలకు తావిస్తోంది. నిజానికి సోరోస్ నెట్వర్క్ లోని భారత రాజకీయ పక్షాలు అదానీ వ్యపార సంస్థలపై విచారణ జరగని, సాక్ష్యాలు లేని ‘ఆరోపణలకు’ అంతగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అనేది ప్రజలుగా మనం ఆలోచించాలి.
2014 లో బీజేపీ పాలన మొదలైన నాటి నుండి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి.. అందులో చాలా కుట్రలు విదేశీ భూభాగంలో రచించినవే అనేది భారత దర్యాప్తు సంస్థలకు తెలుసు అందుకే కుట్ర పూరితంగా జరిగే భారత వ్యతిరేక కార్యకలాపాల వెనుక ఉన్న ‘నెట్వర్క్’ లను కనిపెట్టి ఆయా సంస్థలు, వ్యక్తులకు విదేశీ ఆర్ధిక సహాయం అందకుండా చేయడం మూలాన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల పేరుతో చేసే అన్ని డ్రామాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
అయితే సోరోస్ కి ఉన్న నెట్వర్క్ అసాధారణమైనది, తాను ఎన్నో ఏళ్ల తరబడి నిర్మించిన నెట్వర్క్ ద్వారా తాను గురిపెట్టిన లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకునేలా చేయగలడు.. ఏకంగా అమేరికా వంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయిన ట్రంప్ ని దించేసేందుకు ఎన్నికల ముందు ఆ దేశంలో జరిగిన ఊహించని ‘పరిణామాలకు’ సోరోస్ నెట్వర్క్ కీలక పాత్ర పోషించింది అనేది అమేరికాలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.
అయితే అసలు విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వామపక్ష వాద ప్రభుత్వాలు నెలకొల్పాలనే తన సంకల్పం ముందు ప్రధాని మోదీ అతిపెద్ద ఛాలెంజ్ గా నిలుస్తూ వచ్చాడు.. 2014 లో భారీ విజయం తర్వాత 2019 లో అంతకంటే ఎక్కువ సీట్లు సాధించి మరో దఫా మోదీ ప్రధాని అవ్వడం సోరోస్ నెట్వర్క్ కి అస్సలు మింగుడు పడలేదు. అందుకే మోదీని దించేయాలని ఎన్నో విఫల ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ప్లాన్ సక్సెస్ అవ్వకపోదా అనే పట్టుదలతో ఉన్న ఆ నెట్వర్క్ చివరిగా భారత దేశ ఆర్ధిక రంగం పై దాడి చేసి తద్వారా మోదీని దించేయొచ్చు అనే కుట్ర పన్నారు అనేది ఇప్పుడు చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అలా ఒక గుజరాతీ అయిన గౌతమ్ అదానీ కి చెందిన ‘అదానీ గ్రూప్’ సంస్థ పై తప్పుడు కథనాలతో ఒక రిపోర్టు తయారు చేయించి తన ‘నెట్వర్క్’ ద్వారా ఒకేసారి అన్ని వైపుల నుండి మోదీ వ్యతిరేక ప్రచార హోరు ప్రపంచ వ్యాప్తంగా వినబడేలా చేయాలని ఒక భారీ ప్రణాళిక రచించారు అనేది సుస్పష్టం. ఒక భారత వ్యాపారిని ఒక విదేశీ సంస్థ రిపోర్టు ఆధారంగా భారత్ లోని ఒక సెక్షన్ మీడియా చేత అలాగే కొన్ని రాజకీయ పక్షాల చేత పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేయించి సామాన్య ప్రజలు తమకు తెలియకుండానే సైకలాజికల్ గా ఆ ‘నెట్వర్క్’ వేసిన వలలో పడ్తారనేది వారి కుట్రలో ముఖ్యమైన విషయం అనేది మనం గమనించాలి అందుకే మనం గమనించినట్లైతే అదానీ విషయంలో అసలు విషయ అవగాహన లేకుండానే కొందరు అదానీ పై తప్పుడు రాతలు రాయడం మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం.
మరో వైపు హిండెన్‌బర్గ్ రిపోర్టుని అడ్డం పెట్టుకుని పార్లమెంటు లో అదానీకి మోదీ కి లింక్ పెట్టి కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న నిరసనలకు మోదీ ఇచ్చిన సమాధానం లో ఒక విషయం ఎవరూ ఇలా గమనించి ఉండరు, మోదీ అనే వ్యక్తిని దించేయటానికి ఎన్నో ‘శక్తులు’ ఏకం అయ్యాయని మోదీ అనడం వెనుక అందులో ఒక విదేశీ ‘నెట్వర్క్’ కూడా భాగం అయ్యుంటుంది అనేది ప్రధాని స్థాయి వ్యక్తికి తెలిసే ఉంటుంది.
అయితే మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక దేశ ప్రభుత్వాన్ని కూల్చేయాలనే కుట్ర విదేశీ ప్రభుత్వాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి.. అది సర్వసాధారణమే అని చెప్పుకోవాలి, ఎందుకంటే తమ మాట వినే వ్యక్తులు ఆయా దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా ఉండాలనే ఆలోచనతో ఆయా దేశ ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి.. కానీ ఈ సోరోస్ నెట్వర్క్ వేసిన ప్రణాళిక లో కేవలం ఒక ప్రధానిని దించేయడం మాత్రమే కాదు ఈ దేశ ఆర్ధిక మూలాల పై దాడి దేశ ప్రజల జీవన ప్రమాణాలు తగ్గించి దేశాన్ని అస్తవ్యస్త స్థితికి తీసుకురావాలనే భారీ కుట్ర ఉందనేది గమనించాలి. మరో సంవత్సరంలో సాధారణ ఎన్నికలకు దేశం సిద్ధమౌతున్న వేళ ఈ ‘నెట్వర్క్’ తన లక్ష్య సాధన కోసం మరింత ఎక్కువ శ్రమించి పనిచేస్తుంది అనేది సుస్పష్టం.. కాబట్టి కేవలం ‘అదానీ’ ఎపిసోడ్ తో ఈ కుట్రలు సమసిపోవు, మున్ముందు మరిన్ని ఊహించని అసత్య ప్రచారాలతో భారీ కుట్రలను భారత్ ఎదుర్కోవడం తథ్యం. కావును దేశ ప్రజలుగా మనం సోరోస్ నెట్వర్క్ వైపు ఉన్నామా లేక ప్రధాని మోదీ వైపు ఉన్నామా అనేదాని పై ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 🙏
మరి సోరోస్ నెట్వర్క్ కి మరియు మోదీకి మధ్య జరుగుతున్న ఈ ‘వార్’ లో మీరు ఎవరి వైపు ఉన్నారు?