హ్యూమన్ రైట్స్ టుడే/ నల్గొండ/ మార్చి 01: నల్లొండ జిల్లా పెద్దవూర మండలం బట్టిగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్స్ పేరిట యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేసినా పోలీసులు నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పు బడుతున్నారు.
