హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/జనవరి 16:
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ.1.73 కోట్ల ఆస్తులు ఉన్నాయని తాజా అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో ఆయనకు 2.96 లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు.. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లుగా ప్రకటించారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని తెలిపారు. దంపతులిద్దరి ఆస్తుల విలువ రూ.4.23 కోట్లుగా ఉందని ప్రకటించారు.