తెలంగాణలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలు ఖరార్!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 15:
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యాసంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది.
ఈ మేరకు పరీక్ష తేదీలను బుధవారం ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్ జరగనుంది. బీటెక్, ఫార్మ్ డీ, బీఈ, బీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీఈఏపీ సెట్, పరీక్షలను ఏప్రిల్, మేలో జరుగనున్నాయి.
ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు పరీక్షలు ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల్లో, మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సులకు కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు.
టీజీ ఈసెట్ టీజీసెట్ ప్రవేశ పరీక్ష మే 12న టీజీ ఎడ్‌సెట్, జూన్ 1న టీజీ లాసెట్ TG LAWCET, ఎల్ఎల్ఎం (LLM) కోర్సులకు జూన్ 6, ఐసెట్ (I-CET) పరీక్షలను జూన్ 8, జూన్ 9 తేదీల్లో నిర్వహించనున్నారు.
జూన్ 16 నుంచి 19 వరకు టీజీ పీజీఈసెట్ పరీక్షలను టీజీ పీఈసెట్ TGPECET ప్రవేశ పరీక్షలను జూన్ 11 నుంచి జూన్ 14 వరకు నిర్వహించనున్నారు.