వీఐపీల రాకతో వేములవాడలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు
హ్యూమన్ రైట్స్ టుడే/వేములవాడ: మహాశివరాత్రి వేళ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి సన్నధిలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజన్న దర్శనం కోసం రాత్రి 11 గంటల నుంచి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆలయ అధికారులు వీఐపీల కోసం సాధారణ భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సమయంతో సంబంధం లేకుండా వీఐపీలు వస్తున్న ప్రతిసారీ సాధారణ దర్శనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. పిల్లలతో గంటల కొద్దీ క్యూలైన్లలో ఉండాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన భక్తులు ఈవో డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.