హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/జనవరి 14: రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు.