హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ జనవరి 14: సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి మకరంలోకి వెళ్లే వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు. దీనిని తెలంగాణలో మార్గళి అనీ, గద్దె నిలబెట్టడం అని అంటారు. సంక్రాంతి నిలబెట్టడం అని కూడా అంటారు. ధనుర్మాసంతోపాటు సంక్రాంతి పండుగనూ పీడ తొలగించే పుణ్యకాలంగా భావిస్తారు. శూన్య మాసమైన పుష్యంతో కూడుకున్న ధనుర్మాసంలో శుభ ముహూర్తాలు ఉండవు. వివాహాది శుభకార్యాలు చేయరు. ధనుర్మాసంలో మార్గశిరం ఉన్నట్లయితే శుభకార్యాలు చేసుకోవచ్చు.