దాదాపు 20 శాతం మందికే ఆత్మీయ భరోసా!
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/జనవరి 13: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా దీనికోసం విధి విధనాలు సిద్ధం చేసినట్లు సమాచారం.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 55 లక్షల జాబ్ కార్డులు ఉండగా అందులో 29 లక్షల మందికి ఎటువంటి భూమి లేదు.
ఇందులో ఒకరోజు పనిచేసిన వారు 15 లక్షలు ఉండగా, 10 రోజులు పనిచేసిన వారు 10 లక్షలు ఉన్నారు.
వీరిని మినహాయించి కనీసం 20 రోజులు పైన పనిచేసిన వారు 10 లక్షలు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.12,000 చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం.
దీనికి గాను ఏడాదికి రూ.1200 కోట్లు వెచ్చించనున్న తెలంగాణ ప్రభుత్వం.