ఆల్ ఇండియా నేషనల్ సాఫ్ట్ బాల్ లో గోల్డ్ మెడల్ సాధించిన దుడ్డు కీర్తన ఘనంగా సన్మానించారు.
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/జనవరి 13:
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఓడ్యాట్ పల్లి గ్రామానికి చెందిన దుడ్డు కీర్తన తండ్రి దుడ్డు గంగాధర్ దుడ్డు సవిత కుమార్తె ఇండియన్ నేషనల్ లో జమ్ము కాశ్మీర్లో సాఫ్ట్ బాల్ లో గోల్డ్ మెడల్ సాధించి దుడ్డు కీర్తనను గ్రామ పెద్ద మనుషులు మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద మనుషులు మాజీ సర్పంచ్ రామడొల్ల ప్రవీణ్ ఓడేటమ్మ మాజీ చైర్మన్ బడుగు సత్యం గ్రామ కమిటీ సభ్యులు కార్యదర్శి దుకాణం మోహన్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామడోల్ల ప్రవీణ్ మాజీ ఓడ్డెట్టమ్మ మాజీ చైర్మన్ బడుగు సత్యం మాట్లాడుతూ జాతీయ స్థాయిలు గోల్డ్ మెడల్ సాధించిన ఓడాట్పల్లి గ్రామానికి చెందిన దుడ్డు కీర్తన చదువుతో పాటు క్రీడలలో రాణిస్తూ విజయాలు సాధిస్తున్నందుకు గర్వంగా ఉందని గ్రామానికి మంచి పేరు తెచ్చిన కీర్తన గ్రామ ప్రజలు ఆనంద వ్యక్తం చేశారు. ఇంకా అనేక విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు.
ఈ సన్మానం కార్యక్రమంలో వార్డు నెంబర్ చింతల మోహన్ ఇందూర్ వడ్డెన్న గ్రామ ప్రజలు అంబేద్కర్ అధ్యక్షుడు పంగర చిరంజీవి రమేష్ వినయ్ సుధన్ గ్రామ నాయకులు టీ గంగాధర్ బండి ఓడ్డెన్న సాయిలు ప్రవీణ్ మాజీ ఉపా సర్పంచ్ ఇందూరు ఓడ్డెన్న
సభ్యులు తదితరులు పాల్గొన్నారు.