కానిస్టేబుల్, హోంగార్డ్ లిక్కర్ దందా.
• రూ.15 లక్షల డ్యూటీ ఫ్రీ లిక్కర్ సీజ్
• మూడు కార్లు స్వాధీనం
• ఐదుగురిపై కేసు నమోదు.
హ్యూమన్ రైట్స్ టుడే/రాజేంద్ర నగర్/డిసెంబర్ 29: అక్రమ లిక్కర్ దందా చేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు తోపాటు మరో ఇద్దరిని డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఔట్ పోస్టులో జేమ్యా నాయక్ కానిస్టేబుల్ గా, బండారి లింగయ్య హోంగార్డుగా పని చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి వీరు టికెట్లను తీసుకుని ఎయిర్పోర్టులో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొనేవారు.
ఆ తర్వాత వీటిని బయటకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ము కునేవారు.
పక్కా సమాచారంతో వీరిద్దరితో పాటు వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు హరీశ్ కుమార్, రాఘవేందర్ను శుక్రవారం పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ తెలిపారు.
నిందితుల నుంచి రూ.15 లక్షల విలువ చేసే 46 డ్యూటీ ఫ్రీ మద్యం బాటిళ్లతోపాటు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహేందర్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.