పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు..!!

Get real time updates directly on you device, subscribe now.

దారి తప్పుతోన్న ఖాకీలు.. వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకు..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 29: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో రాణించాల్సిన అధికారులు అక్రమసంబంధాల్లో రాణిస్తున్నారు. గౌరవ కీర్తి పతకాలు అందుకోవాల్సిన వారు కుటుంబీకులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికి రచ్చకెక్కుతున్నారు. భార్య నుంచి విడాకులు కావాలంటూ ఒకరు, కింది స్థాయి ఉద్యోగులతో రాసలీలలతో మరొకరు, సహ ఉద్యోగులతో అక్రమ సంబంధాలతో ఇంకొకరు, ఇలా పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. పరువుకు బయపడి బయటకురాని ఘటనలు మరెన్నో ఒంటరి మహిళ బాధితురాలై స్టేషన్ మెట్లు ఎక్కితే అంగబలంతోనో అధికార దర్పంతోనే లొబర్చుకున్న ఘటనలు మరికొన్ని ఏది ఏమైనా కొందరు అధికారుల తీరుతో పోలీస్ శాఖ అప్రతిష్టపాలవుతోంది. బుధవారం జరిగిన ఘటనతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని బిక్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ అపరేటర్ చెరువులో దూకి అత్మహత్యకు పాల్పడ్డారు.

పోలీస్ శాఖలో జరిగిన కొన్ని ఘటనలు..

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఓ సీఐ, ఎస్సైని అప్పటి ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. గీసుగొండ సీఐ, దామెర ఎస్సై మధ్య అక్రమ సంబంధం బయటపడటంతో వారిని సస్పెండ్ చేశారు. సుబేదారి పీఎస్ ఎస్సై వేధింపుల కేసులో యువతిని కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ విషయం అప్పటి ఐజీ రంగనాథ్ కు తెలియడంతో సస్పెండ్ చేశారు.

కొమురవెల్లి పీఎస్ లో ఏడాదిన్నర కింద అక్కడే పని చేస్తున్న ఎస్సై భార్య, తల్లిదండ్రులతో కలిసి స్టేషన్ ఎదుట అందోళన చేసింది. తన భర్త వేరే మహిళతో కాపురం చేస్తున్నాడని, తన పిల్లలను కూడా తన వద్దకు పంపడం లేదని బైఠాయించింది.

జవహర్ నగర్ ఎస్సైపై సతీష్ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని, ఎస్సైకి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, ఎస్సై క్రెడిట్ కార్డు సైతం తన భార్య వద్ద ఉందని తెలిపాడు.

మహబూబ్ నగర్ సీసీఎస్ లో పని చేస్తున్న సీఐపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడు. అక్రమ సంబంధం విషయంలోనే కానిస్టేబుల్ సీఐపై దాడి చేశారని పోలీసు వర్గాలో చర్చించుకున్నారు.

జగిత్యాల జిల్లా వనపర్తి రూరల్ ఎస్సై వివాహిత మహిళతో ఉండగా, కొత్తకోటకు చెందిన ఆమె భర్త ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై కన్ను..

పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల పట్ల కొందరు అధికారుల తీరు కూడా చర్చనీయాంశమవుతోంది. బాధిత మహిళలకు ఫోన్లు చేస్తూ, మెసేజులు, అశ్లీల వీడియోలు పంపిన ఘటనలు ఉన్నాయి. కానీ బయటకు రాని ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇలా పోలీస్ శాఖకు చెందిన అధికారులు అక్రమ బంధాల కేసులో పట్టుబడుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.

ఉన్నతాధికారులు దృష్టి సారించాలి

పోలీస్ శాఖలో జరుగుతున్న అక్రమ బంధాలు, మహిళల వేధింపులపై ఉన్నాతాధికారులు దృష్టి సారించాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చి పోలీసుల చేతిలో బాధితులుగా మారుతున్న మహిళలకు అండగా ఉండాలని వారు కోరుతున్నారు. వారి కోసం కస్టమర్ కేర్ వంటి సదుపాయాల ద్వారా న్యాయ సహాయం అందించాలని వారు వేడుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment