హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/డిసెంబర్ 11: నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల టూరిజం అనేది పూర్తిగా దెబ్బతిందని పేర్కొంటూ నగరంలోని అన్ని చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పర్యాటక రంగంపై రెడ్ టేపిజం. నిజామాబాద్ జిల్లాలో కొంత మంది అధికారుల కబంధహస్తాల్లో చిక్కిన పర్యాటక రంగం.. త్వరలో పూర్తి ఆధారాలతో మీ ముందుకు’ అంటూవాటిపై రాశారు. కలెక్టరేట్, వినాయక నగర్, కంఠేశ్వర్, నెహ్రు పార్క్, నిఖిల్ సాయి చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు నగరంలో చర్చకు దారి తీశాయి.