ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/డిసెంబర్ 10:
ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు. ఉపాధి కల్పించలేరా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వా  న్ని ప్రశ్నించింది, 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అంద జేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఎంతకాలం ఉచితంగా వస్తువులను ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు, సామర్థ్యాల పెంపుదలపై మనం ఎందుకు పని చేయకూడదని కోర్టు గట్టిగానే అరుసుకున్నది

కోవిడ్ దగ్గర నుంచి వలస కార్మికులకు ఫ్రీ రేషన్ ఇస్తు న్న విషయాన్ని గుర్తు చేస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి.. నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని పేర్కొంది.

జాతీయ ఆహార భద్రత చట్టం 2013 కింద 81 కోట్ల మందికి ఉచితంగా గానీ, రాయతీపైన గానీ రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ధర్మాస నానికి తెలిపింది. కేంద్రం మాటలు విన్న ధర్మాసనం ఆశ్చర్య పోయింది.

పన్ను చెల్లింపుదార్లనే విడిచిపెట్టారు అంటూ వ్యాఖ్యానించింది. కోవిడ్ సమయంలో వలస కార్మికుల సమస్యలపై సుమోటోగా చేపట్టిన వ్యాజ్యంపై సోమవారం అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది.

ఓ స్వచ్చంద సంస్థ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదనలు వినిపించారు. కోవిడ్
సమయంలో ఈ శ్రమ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికు లకు కూడా ఫ్రీగా రేషన్ ఇచ్చారంటూ..దాన్ని కొనసాగించాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది.

ఇంకెంత కాలం ఉచితాలు కొనసాగిస్తారు. వారికి ఉపాధి ఎందుకు కల్పించ డం లేదని ప్రశ్నించింది. ఉచిత వస్తువులను ఎప్పటి వరకు ఇవ్వగలం? ఈ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు, సామర్థ్యాన్ని పెంపొందించడంపై మనం ఎందుకు పని చేయకూ డదు? అని ప్రశ్నించింది.

వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని, కేంద్రం అందించే ఉచిత రేషన్ ప్రయోజనాలను పొందేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తోందని ప్రశాంత్ భూషణ్ తెలిపారు

ఎవరికైనా రేషన్‌కార్డు లేకుంటే, ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్ల యితే, వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ను అందజేస్తుందని,తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment