మోహన్ బాబు బౌన్సర్లు బైండోవర్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 11:
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతిని ధులపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది.

మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. బౌన్సర్ల తో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగ తంగా విచారణకు హాజరు కావాలని మోహన్‌బాబుకు పోలీసు శాఖ సూచించింది.

కాగా..నిన్న మంగళవారం సాయంత్రం పోలీస్ అధికా రులతో కలిసి మంచు మనోజ్ దంపతులు మోహన్‌బాబు నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డీజీపీ ఆఫీస్‌లో అడిషనల్ డీజీపీతో భేటీ అయ్యారు. తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు.

చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు ఓపెన్ చేయకపోవడం తో కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ 7 నెలల పాపలోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు. పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసు లు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా జరుగుతుండగా మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షం లోనే బౌన్సర్లు దాడికి దిగారు. మోహన్ బాబు ఏర్పాటు చేసుకొన్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేశారు. దీంతో ఆయా నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ ఘటనపై రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment