ఇట్లాగే జోకుతామని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..
ప్రజలను మోసం చేస్తున్న రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలి..
600 నుంచి 700 గ్రాములు తగ్గించి తూకం..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ ప్రతినిధి/డిసెంబర్ 10: తక్కువ రేషన్ బియ్యం (పోస్తూ) తూకం వేస్తూ ప్రజలను మోసం చేస్తున్న రేషన్ డీలర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిఎస్ ఓ కు పిర్యాదు చేశారు. మంగళవారం రేషన్ బియ్యం తీసుకుందుకు వెళ్లిన వారిపై దుర్సుకుగా ప్రవర్తించగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఒక పక్క బ్లాక్ లో రేషన్ బియ్యం అమ్ముకుంటూనే, మరో పక్క ఎక్కువ బరువు వచ్చేందుకు జోర సంచితో తూకం వేస్తూ గాజులపెట్ లో చౌక ధరల దుకాణంలో ఒక్కోక్కరికి 600 నుంచి 700 గ్రాములు తగ్గించి ప్రజలను మోసం చేయడాన్ని గమనించి అడ్డుకున్నారు. మోసం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అడిగితే ఇక్కడ ఇట్లాగే జోకుతామని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని ఆ రేషన్ డీలర్ పై చర్యలు తీసుకొని జరుగుతున్న మోసం ఆపాలని ప్రజలు కోరుతున్నారు.